పలువురు కాపు నేతల గృహ నిర్బంధం
పలువురు కాపు నేతల గృహ నిర్బంధం
Published Tue, Jan 24 2017 10:54 PM | Last Updated on Mon, Jul 30 2018 7:59 PM
కాకినాడ రూరల్ :
పాదయాత్ర నేపథ్యంలో కాపు ప్రతినిధుల గృహ నిర్బం ధాలు మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్, కాపు సద్భావన సంఘం జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసుతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంతం నానాజీని, మరికొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారు. దాసు ఇంటి పరిసరాల్లోకి ఏ ఒక్కరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒ¯ŒSటౌన్, టూటౌన్, సర్పవరం సీఐలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మేము ఉగ్రవాదులమా..
గృహ నిర్బంధంలో ఉన్న వాసిరెడ్డి ఏసుదాసు మాట్లాడుతూ శాంతియుత పోరాటం చేస్తున్న తమను ఉగ్రవాదులుగా చూడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆందోళన చేసి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలుగజేయడంలేదని అన్నారు. గృహ నిర్బంధంలో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వం నిర్వహిస్తున్న అరాచకాలు ఆపకపోతే చంద్రబాబు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కోడిపందేలకు అనుమతిచ్చి, దగ్గరుండి మరీ ఆడించిన పోలీసులు ఇప్పుడు కాపులను గృహనిర్బంధం చేయడంలో అర్ధంలేదని నానాజీ అన్నారు. వారితో పాటు సిద్ధా నూకరాజు, సానా శ్రీను, వాసిరెడ్డి రాజేష్‌తో పాటు పలువురు ఏసుదాసు ఇంట్లోనే గృహ నిర్బంధంలో ఉన్నారు.
పిఠాపురంలో జేఏసీ నేత...
పిఠాపురం : కాపు జేఏసీ నేత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గుండా వెంకటరమణను పిఠాపురంలో పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి కిర్లంపూడి వెళ్లే వారిపై పోలీసులు నిఘా పెంచారు. అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాపు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మఫీ్టలో కాపలా కాస్తున్నారు.
గోపాలపురంలో ఆకుల
రావులపాలెం (కొత్తపేట) : కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణను గృహ నిర్బంధం చేశారు. మంగళవారం ఉదయమే డీఎస్పీ టీఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. ఇంటి బయట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సహా పలువురు నాయకులు చేసిన పాదయాత్రకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముద్రగడ యాత్రకు మాత్రమే ఈ విధంగా ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు.
గృహ నిర్బంధాలు తగవు
కోరుకొండ (రాజానగరం) : ముద్రగడ పద్మనాభం శాంతియూతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు తమను గృహ నిర్బంధం చేస్తున్నారని వైఎస్సార్ పీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. కోరుకొండ మండలం రాఘవపురంలో మంగళవారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు.
Advertisement