
పార్టీని విమర్శిస్తే చర్యలు తప్పవు
కేఈ ప్రభాకర్‌కు డిప్యూటీ సీఎం కేఈ హెచ్చరిక
కర్నూలు: సీఎం చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తే అన్న, తమ్ముడు, బంధువు, స్నేహితులు అనే సంబంధం లేకుండా ప్రతివిమర్శ చేయాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి.. తనసోదరుడు కేఈ ప్రభాకర్‌ను పరోక్షంగా హెచ్చరించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అందుకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు ఉంటాయని తెలిపారు.
శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.టీడీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన సందర్భంగా కేఈ ప్రభాకర్‌కు సీఎం చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో తనకు తెలియదన్నారు.