'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం' | Kovvada people denied to servey lands for nuclear center | Sakshi
Sakshi News home page

'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం'

Published Mon, May 23 2016 6:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం'

'కొవ్వాడలో భూముల సర్వేకు ఒప్పుకోం'

శ్రీకాకుళం (ఎచ్చెర్ల) : రణస్థలం మండలం కొవ్వాడలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన అణువిద్యుత్ కేంద్రానికి ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సోమవారం మధ్యాహ్నం కోటపాలెం, అల్లివలస ప్రాంతాల్లో భూముల సర్వే కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్ ఎం. సురేష్ వచ్చారు. దాంతో అక్కడి ప్రజలు వారిద్దరినీ అడ్డుకున్నారు. కలెక్టర్ ప్రజలకు ప్యాకేజీలు ఇస్తామని, పునరావసం కల్పిస్తామని ఆయన చెప్పిన గ్రామస్థులు ఒప్పుకోలేదు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అణువిద్యుత్తు కేంద్రంతో ఈ ప్రాంతం నాశనమైపోతుందని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిర్మాణ పనులకు ఎలా పూనుకుంటున్నారంటూ గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో రణస్థలం ఎస్సై సత్యనారాయణ రంగం ప్రవేశం చేశారు. భూమల సర్వే కోసం వచ్చిన కలెక్టర్ సీతారామారావును అధికారులను ఎస్సై అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement