కురుమ గర్జన విజయవంతం చేయాలి | Kuruma garjana must succeed | Sakshi
Sakshi News home page

కురుమ గర్జన విజయవంతం చేయాలి

Published Tue, Sep 13 2016 5:37 PM | Last Updated on Fri, May 25 2018 5:57 PM

Kuruma garjana must succeed

తొగుట: ఈ నెల 16న మిరుదొడ్డిలో నిర్వహించే దుబ్బాక నియోజకవర్గస్థాయి కురుమ గర్జనను విజయవంతం చేయాలని సంఘం మండల అధ్యక్షుడు దేవునూరి పోశయ్య కోరారు. మండల కేంద్రంలో మంగళవారం  తెలంగాణ ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండల అధ్యక్షుడు గుంటి యాదగిరి, ఘణపురం సర్పంచ్‌ అక్కం స్వామిలతో కలిసి కురుమ గర్జన కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 559, 1016ల ప్రకారం ప్రతి గ్రామానికి గొర్లు, మేకల మేత కోసం 15 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి కురుమ వృద్ధుడికి పెన్షన్‌ సదుపాయం కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

ప్రతి జిల్లాలో కురుమ విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 16న మిరుదొడ్డిలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి కురుమ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు యాదగిరి, అశోక్‌, మల్లేశం, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement