కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఉన్న ఆమెజాన్ గోడౌన్‌లో భారీ చోరి జరిగింది.
కొత్తూరు(రంగారెడ్డి జిల్లా):
కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఉన్న ఆమెజాన్ గోడౌన్‌లో భారీ చోరి జరిగింది. గోడౌన్‌లో దాచిన 20 హెచ్‌పీ, 16 ఆపిల్ ల్యాప్‌ట్యాప్‌లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుంది.
ఈ మేరకు గోడౌన్ నిర్వాహకుడు వైఎన్ ఎస్ రెడ్డి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.