తిరుపతి జూలో క్యాన్సర్‌తో సింహం మృతి | lion dead with cancer in tirupati Zoo | Sakshi
Sakshi News home page

తిరుపతి జూలో క్యాన్సర్‌తో సింహం మృతి

Published Sat, Jan 2 2016 8:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్)లో శనివారం అనారోగ్యంతో హరి(8) అనే మగ సింహం మృతి చెందింది.

తిరుపతి: తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్)లో శనివారం అనారోగ్యంతో హరి(8) అనే మగ సింహం మృతి చెందింది. ఎస్వీ జూపార్క్‌కు వచ్చే సందర్శకుల కోసం 2014 సంవత్సరంలో హైదరాబాదు జూ నుంచి దీనిని తీసుకొచ్చారు. కొద్ది రోజుల నుంచి ఈ సింహం క్యాన్సర్‌తో బాధపడుతోందని ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆహారం కూడా తీసుకోవడం మానేసిందని, దీంతో ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు.

మృత్యువు ముంగిట మరో పది

ఎస్వీ జూపార్క్‌లో వయసుడిగి, క్యాన్సర్‌తో బాధపడుతూ మరో 10 సింహాలు మృత్యువుకు చేరువయ్యాయి. ఇటీవల జూలో అనేక జంతువులు వివిధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జూలతో పోల్చితే ఎస్వీ జూపార్క్‌లో సింహాల సంఖ్య ఎక్కువ. అయితే ఇలా అనారోగ్యానికి గురవుతుంటే చివరకు జూలో సింహాలకు బదులు వాటి కళేబరాలే మిగులుతాయని కొందరు జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement