మరుగుదొడ్లు కట్టుకుంటే రుణాలు
–జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
కర్నూలు(హాస్పిటల్): వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేసుకునే బడుగు బలహీన వర్గాల వారికి ఆయా సంక్షేమ శాఖల ద్వారా, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మరుగుదొడ్ల నిర్మాణాలపై సంబం«ధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యపరచాలని సీఆర్‌పీలకు సూచించారు. గ్రామాల వారీగా ఎంత మందికి మరుగుదొడ్లు ఉన్నాయి, ఎంత మందికి లేని వివరాలు కూడా పకడ్బందీగా సేకరించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ పుల్లారెడ్డి, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.