తెలంగాణకు 13వ ర్యాంకా?
హైదరాబాద్: పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రాల్లో తెలంగాణకు 13వ ర్యాంకు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంకింగ్లో తెలంగాణను వెనక్కి నెట్టడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఏ పద్దతి ప్రకారం ర్యాంకులు ప్రకటించారో సరిగ్గా తెలియదు కానీ, మేం ఏం చేస్తున్నామో మా పని తీరే చెబుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ర్యాంకుల ప్రకటనపై అంతగా దిగులు చేందాల్సిన అవసరం లేదన్నారు.
సులభంగా వ్యాపారం చేసే అంశంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ఇవ్వగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ రెండో ర్యాంకు సాధించింన విషయం తెలిసిందే. మొదటి స్థానంలో ఎప్పటిలాగే గుజరాత్ నిలవగా, మూడో స్థానంలో జార్ఖండ్ ఉంది. గుజరాత్ స్కోరు 71.14 శాతం కాగా, ఏపీ స్కోరు 70.12 శాతం. ఇక తెలంగాణ రాష్ట్రం 42.45 శాతం స్కోరుతో 13వ స్థానంలో నిలిచింది. మొత్తం 29 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రపంచబ్యాంకు ఈ ర్యాంకులు ఇచ్చింది.
Lot of folks wondering about ease of doing business ranking. Not sure about methodology but, We will let our work speak & not fret over this
— KTR (@KTRTRS) September 15, 2015