ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్ | Love married young woman kidnapped | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్

Published Fri, Dec 9 2016 10:40 PM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్ - Sakshi

ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్

మిర్యాలగూడ అర్బన్ : ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాపైన సంఘటన గురువారం పట్టణంలోని సుందర్‌నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సుందర్‌నగర్‌కు చెందిన గుంటిపల్లి మల్లయ్య, మంగమ్మ కుమారుడు నరేందర్,  విద్యానగర్ కాలనీకి చెందిన రున్యాల కరణ్‌సింగ్  పెద్ద కుమార్తె దీప మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోగా అమ్మారుు తల్లిదండ్రులు మరొక వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. దీంతో వారు నల్లగొండలోని ఆర్యసమాజ్ మందిరంలో గతనెల 22వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డిని ఆశ్రయించారు.
 
 వారి వివరాలు తెలుసుకున్న ఎస్పీ మిర్యాలగూడ వన్‌టౌన్ స్టేషన్‌కు సమాచారం అందించి వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. అదేరోజు సాయంత్రం ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ జంట హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఆ జంట సుందర్‌నగర్‌లోని అబ్బాయి నరేందర్ ఇంటికి వచ్చారు. వారు వచ్చిన విషయం తెలుసుకున్న అమ్మా తల్లిదండ్రులు, బంధువులు సుమారు ఇరువై మంది ఇంటిపై దాడిచేసి కుటుంబ సభ్యులను  తీవ్రంగా గాయపరిచి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అమ్మారుు తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్ తెలిపారు. కాగా బాధితుడు నరేందర్ మాట్లాడుతూ తనకు కూడా ప్రాణహాని ఉందని,  రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement