నో క్లియర్ | main executives posts vacancy in district | Sakshi
Sakshi News home page

నో క్లియర్

Published Sat, Feb 27 2016 2:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

main executives posts vacancy in district

కుప్పలు.. తెప్పలు..
అన్ని విభాగాల్లో  పేరుకుపోతున్న ఫైళ్లు
ఒక్కో అధికారికి రెండు, మూడు  బాధ్యతలు

ఇందూరు :  జిల్లాలో ప్రధాన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నారుు. ఒక్కో అధికారికి రెండు, మూడు బాధ్యతలు ఉండటంతో అటు సొంత శాఖకు.. ఇటు అదనంగా ఇచ్చిన శాఖకు న్యాయం చేయలేక పోతున్నారు. కార్యాలయూల్లో చాలా ఫైళ్లు కుప్పలు          తెప్పలుగా పేరుకుపోరుు పెండింగ్‌లో ఉంటున్నారుు. వీటికి సంబంధించిన వారు పనులు కాక కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడు అధికారులు లేక వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వారు ఉసురుమని వెళ్తున్నారు.

 ఆర్డీవో కార్యాలయంలో పేరుకుపోయాయ్..
జిల్లాకే జిల్లా రెవెన్యూ కార్యాలయం తలమానికం. దీనికి     కలెక్టర్ పరిపాలన విభాగం అని మరో పేరు కూడా ఉంది. జిల్లా కలెక్టర్‌కు ప్రతీ ఫైలు ఇక్కడి నుంచే వెళ్తుంది. మొత్తంగా  చెప్పాలంటే కలెక్టర్ పరిపాలన ఇక్కడి నుండే జరుగుతుంది. ప్రజాసమస్యలు మొదలుకుని అధికార యంత్రాంగం వరకు ఇదే మూల సముదాయం. మండల పరిషత్‌ల పరిపాలనను చూసుకోవడం, ఇతర పనులు చాలనే ఉంటాయి. ఇటు కలెక్టర్ పరిపాలన విభాగంలో మూడు రెవెన్యూ డివిజన్ అధికారులు కార్యాలయాలతోపాటు మండల తహసీల్దార్ కార్యాలయాలను చూసుకోవాలి. ఉద్యోగుల వేతనాలు, గన్ లెసైన్స్, లా అండ్ ఆడర్స్, ఆపద్బంధు, భూమి, కోర్టు కేసులు, ఎన్నికలు, ప్రజావాణి, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, ప్రోటోకాల్, మీసేవా, ఇతరాత్ర చాలా పనులు డీఆర్వో కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇవే కాకుండా కలెక్టర్, జేసీలు చెప్పిన పనులు కూడా ఉంటాయి.

ఈ శాఖకు ఏడు నెలలుగా రెగ్యూలర్ డీఆర్వో లేక ఇన్‌చార్జి పాలనలో కొనసాగుతోంది. ఇన్‌చార్జి అధికారిగా జెడ్పీ సీఈఓ మోహల్‌లాల్‌ను నియమించారు. జెడ్పీ కూడా పెద్దదే. దీనికితోడు ఆర్డీవో పెద్ద విభాగ సమావేశాలు, పర్యవేక్షణ, మరో పక్కా ఫైళ్లను చూసి వాటిపై సంతకాలు చేసి పంపాలంటే తలకు మించిన భారంగా తయారైంది. కలెక్టర్‌కు సంబంధించిన ఫైళ్లు క్లియర్ అవుతున్నా.. మండలాలకు చెందిన, ఇతర ఫైళ్లు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడం లేదు.  రెగ్యులర్ డీఆర్వోను ప్రభుత్వం నియమిస్తే తప్పా ఇబ్బందులు తప్పేలా లేవు. ఇదిలా ఉండగా రెగ్యులర్ డీఆర్వో లేకపోవడంతో కొంత మంది ఉద్యోగులకు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందనే విమర్శలు ఉన్నారుు.

మైనార్టీ కార్పొరేషన్‌కు రెగ్యులర్ ఈడీగా పని చేస్తున్న ప్రేమ్‌కుమార్ అదనంగా మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా, మరో పక్క రాజీవ్ విద్యా మిషన్‌కు ప్రాజెక్టు డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూట కో శాఖలో గంటకో కూర్చీలో కూర్చుంటున్నారు. దీంతో తన సొంత శాఖతోపాటు అదనంగా ఉన్న శాఖలకు న్యాయం చేయలేకపోతున్నారు. పనులు, ప్రజా సమస్యలు త్వరగా పూర్తి కావడం లేదు.

జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ డిప్యూటీ డెరైక్టర్‌గా కొనసాగుతూ జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌కు ఇన్‌చార్జ్జి అధికారిగా పనిచేస్తున్నారు. రెండు పెద్ద శాఖలే కావడంతో కార్యకలాపాలు చూసుకోవడం కష్టంగా మారింది. హాస్టళ్ల పర్యవేక్షణపై ప్రభావం పడుతోంది. ఫైళ్లు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

జిల్లా బీసీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ అధికారిగా పని చేస్తున్న విమలాదేవికి అదనంగా బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. స్టడీ సర్కిల్ నగర శివారులో దూరంగా ఉండటంతో అక్కడి వరకు వెళ్లి విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారింది. ఫైళ్లపై సంతకాలు కావాలంటే స్టడీ సర్కిల్ సిబ్బంది ఐదు ఏడు కిలో మీటర్లు ప్రయాణించి కలెక్టర్‌లో ఆమెతో సంతకాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యువజన సంక్షేమ శాఖకు రెగ్యులర్ సీఈఓగా పని చేస్తున్న ఉపేందర్ అనదనంగా అర్బన్ ఐకేపీ మెప్మా, టూరిజం శాఖలకు ఇన్‌చార్జి అధికారిగా పని చేస్తున్నారు. మూడు శాఖలను తాను ఒక్కడే చూసుకోవడం కష్టంగా మారింది. ఫైళ్లను చూసేందుకు సమయం దొరకడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement