భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం | make land problems less state | Sakshi
Sakshi News home page

భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం

Published Mon, Dec 19 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM

భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం

భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం

–ప్రభుత్వానికి రెవెన్యూశాఖ వెన్నెముకలాంటిది
-  సమస్యలుంటే నా ద​ృష్టికి తీసుకోరండి
- రాష్ట్ర వీఆర్‌ఓల సంఘం మొదటి ప్రాంతీయ సదస్సులో డిప్యూటీ సీఎం
–రెవెన్యూలో అవినీతి తగ్గింది- ఏపీఆర్‌ఎస్‌ఏ అధ్యక్షుడు వెల్లడి
 కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్రాన్ని భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుదామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి  రెవెన్యూఉ  ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. రెవెన్యూలో చేయాల్సింది ఇంకా ఉందని చెపా​‍్పరు. ఆదివారం కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ పంక‌్షన్‌ హాల్‌లో రాష్ట్ర, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రాంతీయ సదస్సు  నిర్వహించారు. కర్నూలు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల వీఆర్‌ఓలు, ఆయా జిల్లాల గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ప్రాతీయ సదస్సుకు   అతిథిగా హాజరై ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ సదస్సు మొదట కర్నూలులో నిర్వహించడం  వెనుక  నా ప్రాంత రెవెన్యూ ఉద్యోగులు సంతోషంగా ఉండేలానే ఉద్దేశం దాగి ఉందన్నారు. ఆ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తానని చెప్పారు.  వీఆర్‌ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్‌ వరకు ప్రతి ఒక్కరూ జవాబు దారి తనంతో పనిచేయడం వల్ల ప్రజాసాధికార సర్వే, భూసేకరణ, రాజధానిలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ వెన్నుముక లాంటిదని తెలిపారు. గత ప్రభుత్వం పరిష్కరించని మీ సమస్యలను రెండున్నర ఏళ్లలో తాను తీర్చడం ఎంతో సంతృప్తి  ఇచ్చిందని తెలిపారు.  రాష్ట్ర  రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...రెవెన్యూలో అవినీతి తగ్గిందని టాప్‌టెన్‌లో కూడా మన శాఖ లేదని తెలిపారు.  
 
        రెవెన్యూ శాఖకు వీఆర్‌ఓలు పట్టుకొమ్మలు లాంటి వాళ్లని వారి సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ మంత్రి పట్టుదలతో ఉన్నారని  చెప్పారు. రాష్ట్ర వీఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు భక్తవత్సలనాయుడు మాట్లాడుతూ....   వీఆర్‌ఓలపై ఉన్న అవినీతి మచ్చను చెరిపివేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వీఆర్‌ఓలకు జూనియర్‌ అసిస్టెంటు స్కేల్‌తో పాటు అర్హతలను బట్టి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చేసే కార్యక్రమాలన్నీ గ్రామ స్థాయిలో వీఆర్‌ఓ చేస్తారని,  ఆ పోస్టుకు అంత ప్రాధాన్యత ఉందని వివరించారు.    ప్రజాసాధికార సర్వే విజయవంతంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎనలేనిదని చెప్పారు.  ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని వీఆర్‌ఓల రాష్ట్రం సంఘం, ఏపీ ఆర్‌ఎస్‌ఏ, వివిధ జిల్లాల యూనిట్లు ఘనంగా సత్కరించాయి.  కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, రాష్ట్ర వీఆర్‌ఓల సంఘం కార్యదర్శి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలిబాష, కర్నూలు జిల్లా రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్‌రెడ్డి, జిల్లా వీఆర్‌ఓల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.రాముడు, జయరామిరెడ్డి, అనంతపురం జిల్లా నేతలు, అనంతపురం జిల్లా నేతలు విజయభాస్కరరెడ్డి, పెద్దన్న, ఏపీఆర్‌ఎస్‌ఏ నేత జయరాముడు, వైఎస్‌ఆర్‌ జిల్లా నేతలు, హుస్సేన్‌రెడ్డి, సుధాకర్, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కైకాల గోపాల్‌రావు వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement