గ్రామీణ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దండి
గ్రామీణ విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దండి
Published Wed, Aug 17 2016 12:17 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
– ఉద్యోగ నైపుణ్య భాగ్యాన్ని కల్పించండి
– స్కిల్ డెవలప్‌మెంట్ ట్రై నింగ్‌తో ఉద్యోగాలు సొంతం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
గ్రామీణ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి మెరికల్లాగా తయారు చేసే బాధ్యత ప్రిన్సిపాళ్లదేనని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీలోని సెనేట్ హాల్‌లో డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు స్కిల్‌డెవలప్‌మెంట్‌పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాస రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఏడాది కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన 1087 మంది విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్రా తదితర కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడంలో ప్రిన్సిపాళ్ల పాత్రనే కీలకమన్నారు. వీరు ప్రోత్సాహంతోనే విద్యార్థులు చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు సాధించారన్నారు. డిగ్రీ చదివే విద్యార్థులే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, కమ్యూనికేషన్, సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నామన్నారు.
సమస్యలను ఏకరవు పెట్టిన ప్రిన్సిపాళ్లు
మరోవైపు డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాళ్లు ఏకరవు పెట్టారు. ఆదోని ఏఏస్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు రీయింబర్స్‌మెంట్ కోసమే కళాశాలలకు వస్తున్నారన్నా విషయంలో వాస్తవం లేదన్నారు. కేవీఆర్ డిగ్రీ కళాశాలలో తరగతి గదులు, హాస్టల్ భవనాలు పాతవి కావడంతో పాములు వస్తున్నాయని, కొత్త వాటి కోసం నిధులు మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కోరారు. ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం లేకపోవడంతో జూనియర్ కళాశాలల నడుపుతున్నామని, ఇక్కడా ఒక్కరే రెగ్యులర్ అధ్యాపకుడు ఉన్నాడని ప్రిన్సిపాల్ చెప్పాడు. ఇలా ప్రతి కళాశాలలో నెలకొన్న సమస్యలను ప్రిన్సిపాళ్లు ఏకరువు పెట్టడంతో సమావేశాన్ని తొందరగా ముగుంచుకొని మంత్రి వెళ్లిపోయారు. కార్యక్రమంలో వైస్ చాన్సులర్ వై.నరసింహులు, రిజిస్ట్రార్ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి, మణిగాంధీ, స్కిల్ డెవల్‌పమెంట్ స్టేట్ చైర్మన్ గంగా సుబ్బారావు పాల్గొన్నారు.
Advertisement