'హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ వేయండి'
'హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ వేయండి'
Published Mon, Dec 28 2015 1:29 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
హైదరాబాద్: రాష్ట్రంలో హెల్మెట్ల వాడకంపై సోమవారం హైకోర్టులో విచారణ చేపట్టారు. హెల్మెట్ వాడకంపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోతే హెల్మెట్ ధర కంటే ఎక్కువ ఫైన్ విధించాలని న్యాయస్ధానం ఆదేశించింది.
హైకోర్టు వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ ఏజీ చైన్ స్నాచింగ్ ల కారణంగా హెల్మెట్ వాడకంపై కఠినంగా వ్యవహరించడం లేదని తెలిపింది. అయితే ఏజీ వాదనలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement