సమావేశంలో మాట్లాడుతున్న మల్లు స్వరాజ్యం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలో ప్రజా భూకంపం రానుందని మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం గ్రేటర్ కమిటి ఆధ్వర్యంలో వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి మోసం చేసిందన్నారు. తన లాగ భూమిని పంచే ధైర్యం ఏ ఎమ్మెల్యేకైనా ఉందా అని సవాల్ చేశారు. ఒక్క ఉయ్యాల పాటతోనే ప్రజలందరిని చైతన్యం చేశామన్నారు. కమ్యూనిస్టులతోనే ప్రజల పాలన సాధ్యమన్నారు. కార్యక్రమంలో నర్సింగరావు, డాక్టర్ అందె సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.