పబ్లిక్ స్మోకింగ్కు ఫైన్ వేశారని ఆత్మహత్యాయత్నం! | man attempts suicide as he was fined for public smoking | Sakshi

పబ్లిక్ స్మోకింగ్కు ఫైన్ వేశారని ఆత్మహత్యాయత్నం!

Published Fri, Jun 10 2016 10:52 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

పబ్లిక్ స్మోకింగ్కు ఫైన్ వేశారని ఆత్మహత్యాయత్నం! - Sakshi

పబ్లిక్ స్మోకింగ్కు ఫైన్ వేశారని ఆత్మహత్యాయత్నం!

పబ్లిక్ స్మోకింగ్ పోలీసులు జరిమానా వసూలు చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి..

మైదుకూరు టౌన్ (వైఎస్సార్ జిల్లా): బహిరంగ ధూమపానం (పబ్లిక్ స్మోకింగ్) చట్టరీత్యా నేరం. ఇదేమీ పట్టకుండా ఓ ప్రభుత్వ ఉద్యోగి బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగుతూ పోలీసుల కంట్లో పడ్డాడు. పోలీసులు జరిమానా వసూలు చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టాపురం గ్రామానికి చెందిన నారమ్మగారి వెంకటసుబ్బయ్య తెలుగుంగ ప్రాజెక్టులో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం స్థానిక బద్వేల్ రోడ్డులోని పొట్టిశ్రీరాములు విగ్రహం సమీపంలో సిగరెట్ తాగుతుండగా మైదుకూరు అర్బన్ సీఐ గమనించారు. పొగతాగడం నేరమని హెచ్చరించి, అందుకు జరిమానా కూడా వేశారు. ఫైన్ ఎందుకు కట్టాలని, తాను ప్రభుత్వ ఉద్యోగినంటూ వాదనకు దిగాడు. అనంతరం జరిమానా కట్టాడు. ఇదంతా అవమానంగా భావించిన వెంకటసుబ్యయ్య కొద్దిసేపటి తర్వాత సమీపంలోని ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్లి పురుగుమందు కొని ఇంటికి వెళ్లే దారిలో తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి, కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప తరలించారు. అక్కడి నుంచి తమిళనాడులోని వేలూరుకు తరలించారు. ఈ విషయంపై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరమని, నిబంధనల ప్రకారం జరిమానా వేసి రశీదు కూడా అందజేశానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement