ఓ యువకుడు గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందిన సంఘటన శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద చోటుచేసుకుంది.
చిట్యాల: ఓ యువకుడు గుట్టపై చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందిన సంఘటన శనివారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద చోటుచేసుకుంది. గ్రామ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్టపై ఓ గుర్తుతెలియని యువకుడు(28) అనుమానాస్పద స్థితిలో మృతిచెంది చెట్టుకు వేలాడుతున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైన హత్య చేసి తీసుకొచ్చి చెట్టుకు ఉరి వేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.