పావగడ : విద్యుత్ రాగి తీగలను చోరీ చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి అవే తీగలకు బలయ్యాడు. తాలూకాలోని జే.అచ్చంపల్లి గ్రామంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి సమీపంలోని రొప్పం గ్రామానికి చెందిన ఇమామ్ ఖాన్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి జే.అచ్చంపల్లి గ్రామానికి విద్యుత్ రాగి తీగల దొంగతనానికి వెళ్లాడు.
విద్యుత్ స్తంభాన్ని ఎక్కి తీగల్ని పట్టుకున్నాడు. అయితే విద్యుత్ సరఫరా అవుతుండటంతో షాక్‌కు గురై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటనలపై కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ అబ్దుల్ నబీ తెలిపారు.
ప్రాణాలు తీసిన చోరీ
Published Thu, Mar 2 2017 9:18 PM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM
Advertisement
Advertisement