అధికారం ఉంటే చాలు .. తమ స్వలాభం కోసం నడిరోడ్డులో వాహనరాకపోకల్ని కూడా అడ్డుకోవచ్చుంటున్నారు.. తెలుగుదేశం నాయకులు. ట
కదిరి: అధికారం ఉంటే చాలు .. తమ స్వలాభం కోసం నడిరోడ్డులో వాహనరాకపోకల్ని కూడా అడ్డుకోవచ్చుంటున్నారు.. తెలుగుదేశం నాయకులు. గురువారం జరగనున్న మార్కెట్‌యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఒక రోజు ముందే ఆ దారి గుండా వాహన రాకపోకలు బంద్ చేశారు.
‘మా రోడ్డు–మా ఇష్టం’ అంటూ అక్కడ కొందరు టీడీపీ నాయకులు నిలబడి బహిరంగంగా అంటున్నారని కొందరు పట్టణ ప్రజలు ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ బుధవారం మీడియా ముందే పట్టణ ఎస్‌ఐకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ‘అది అధికార పార్టీ కార్యక్రమం. మేం ఏం చేయలేం’ అన్న సమాధానం వచ్చింది. దీనిపై తాను కోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలు చేస్తానని మాజీ మంత్రి విలేకరులకు తెలిపారు.