భర్తను శిక్షించాలని సెల్ఫీ వీడియో తీసి.. | married woman suicide after recorded selfie video | Sakshi
Sakshi News home page

భర్తను శిక్షించాలని సెల్ఫీ వీడియో తీసి..

Published Fri, May 6 2016 5:57 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

భర్తను శిక్షించాలని సెల్ఫీ వీడియో తీసి.. - Sakshi

భర్తను శిక్షించాలని సెల్ఫీ వీడియో తీసి..

విజయవాడ: వేధింపులకు ఓ వివాహిత బలైంది. తన కష్టాలను తెలియజేస్తూ, భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, ఇద్దరు పిల్లలను బాగా చదివించాలని కోరుతూ.. సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడ భవానీపురంలో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

హుస్సేన్‌ బీ అనే మహిళకు విజయవాడకు చెందిన జాన్ పాడ్ అనే వ్యక్తితో 5 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే జాన్ పాడ్‌ మరో మహిళను వివాహం చేసుకుని, మొదటి భార్య హుస్సేన్‌ బీని వేధింపులకు గురిచేసేవాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హుస్సేన్‌ బీ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆవేదనను ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement