సైదాబాద్ : రంగారెడ్డి జిల్లాకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామన్నారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. చంపాపేటలోని సామ నర్సింహారెడ్డి గార్డెన్‌లో మంగళవారం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ విజయంలో రంగారెడ్డి జిల్లా ప్రజల కృషి ఎంతో ఉందని వివరించారు. జూన్ నుంచి వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, యాదవరెడ్డి, షంబీపూర్ రాజు, నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లాకు పెద్ద పీట: కేటీఆర్
Published Tue, Mar 15 2016 5:39 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement
Advertisement