ఎస్సారెస్పీ స్థలంలో ఎమ్మెల్యే డ్రైవర్ ఇంటి నిర్మాణం కూల్చివేసిన తహసీల్దార్
తిరిగి నిర్మించిన టీఆర్‌ఎస్‌నాయకులు
పనులు నిలిపివేయించిన సబ్‌కలెక్టర్
మెట్‌పల్లి: ప్రభుత్వ స్థలంలో ఓ ఇంటి నిర్మాణం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సబ్‌కలెక్టర్ ముషారఫ్‌ల మధ్య వివాదానికి దారి తీసింది. పట్టణంలోని రాంనగర్‌లో ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వ–32కు చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే వద్ద డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి అక్రమించి కొన్ని రోజుల నుంచి ఇంటిని నిర్మిస్తున్నాడు. దీనిపై కొందరు సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన దానిని తొలగించాలని తహశీల్దార్ సుగుణాకర్‌రెడ్డిని ఆదేశించారు. దీంతో తహశీల్దార్ మంగళవారం సాయంత్రం సిబ్బందితో అక్కడకు వెళ్లి దానిని తొలగించారు. పలువురు టీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తహశీల్దార్ పట్టించుకోకుండా కూల్చివేయించారు. ఇదే విషయాన్ని నాయకులు ఎమ్మెల్యేకు తెలుపగా, ఆయన తహశీల్దార్‌పై తీవ్ర స్థాయిలో అగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అంతేగాకుండా రాత్రి సమయంలో భారీ ఎత్తున టీఆర్‌ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి తరలివచ్చి తిరిగి ఇంటి నిర్మాణం చేపట్టారు. తహాశీల్దార్‌పై ఎమ్మెల్యే అగ్రహాం వ్యక్తం చేయడం, తిరిగి నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలుసుకున్న సబ్‌కలెక్టర్ నేరుగా పోలీస్ బందోబస్తుతో సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రభుత్వ స్థలంలో ఇంటిని ఎలా నిర్మిస్తారంటూ అక్కడ ఉన్న నాయకులపై అగ్రహాం వ్యక్తం చేసి ఇటుకలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. దీనికి నాయకులు అడ్డుతగిలి సబ్‌కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. సీఐ సురేందర్‌తో సబ్‌కలెక్టర్ ఆయనతో మాట్లాడి నిర్మాణ పనులు జరుగకుండా చూడాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే వర్సెస్ సబ్‌కలెక్టర్
Published Wed, Jan 25 2017 9:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
Advertisement
Advertisement