
పరీక్షలకు వెళ్లేది ఎమ్మెల్యేలే..!
గ్రేటర్ సమీక్ష సందర్భంగా మం త్రి కేటీఆర్ సమన్వయ లోపంపై ముఖ్యంగా ప్రస్తావిం చారు.
హన్మకొండ అర్బన్ : గ్రేటర్ సమీక్ష సందర్భంగా మం త్రి కేటీఆర్ సమన్వయ లోపంపై ముఖ్యంగా ప్రస్తావిం చారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, శానిటేషన్, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల పనులపై మాట్లాడే క్రమంలో ప్రతి విషయంలో అధికారులను బాధ్యులను చేస్తున్న ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ సుతిమెత్తంగా చురకలు అంటించారు. డబుల్ బెడ్‌రూం నిర్మాణం, పార్కులు, జంక్షన్ల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే మంత్రి కలుగజేసుకున్నారు.
‘‘ప్రతి విషయం లో ముఖ్యమంత్రో.. ఇంకొకరో వచ్చి పనిచేయరు.. మీరు హైదరాబాద్‌కు వస్తుంటారు.. సెక్రటేరియట్ స్థారుులో కావాల్సిన వాటి గురించి అక్కడ ఫాలో ఆప్ చేయాలి.. లేదా జిల్లాలో ఉప ముఖ్యమంత్రికి చెప్పా లి.. మీ నియోజకవర్గ పరిధిలో జరిగే పనులపై వేరేవారికి ఎందుకు శ్రద్ధ ఉంటుంది.. నిర్లక్ష్యంతో పనులు వదిలేస్తే వచ్చే రెండేళ్లకో.. మూడేళ్లకో జరిగే పరీక్షలకు (ఎన్నికలకు) వెళ్లేది మీరే కదా..’’ అని కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు. ఈ విషయంలో ఇప్పటికై నా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.