సెల్‌ఫోన్ పోగొట్టిందని భార్యను..
సెల్‌ఫోన్ పోగొట్టిందని భార్యను..
Published Mon, Jul 25 2016 10:28 AM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
శంషాబాద్ రూరల్:
సెల్ఫోన్ పోగొట్టిందని కోపోద్రిక్తుడైన భర్త, భార్యను కొట్టండంతో ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్తను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ అహ్మద్‌పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేట్ మండలం బుడ్డితండాకు చెందిన దంపతులు బన్నీ(40), కిషన్ నెల కిందట మండల పరిధిలోని పెద్దషాపూర్ తండాకు వలస వచ్చారు. వీరికి కూతురు అనిత ఉంది.
భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 18న బన్నీ సెల్‌ఫోన్ పోగొట్టిందని ఆగ్రహానికి గురైన కిషన్ ఆమెతో గొడవపడి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన బన్నీని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 21న రాత్రి మృతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య మృతికి కారణమైన కిషన్‌ను ఆదివారం అరెస్టు చేశారు.
Advertisement
Advertisement