తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం
Published Sat, Aug 6 2016 9:26 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
తాండూరు రూరల్: కుటుంబ కలహాలతో తల్లీకొడుకులు ఆత్మహత్యాయత్నానికి యత్నిం చారు. ఈ సంఘటన మండలంలోని సంగెం కాలన్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, జిల్లా ఆస్పత్రి సిబ్బంది కథనం ప్రకారం.. సంగెంకాలన్ గ్రామానికి చెందిన యశోదమ్మ, తిప్పన్న దంపతులు. వారికి కుమారుడు చంద్రశేఖర్ ఉన్నాడు. రెండేళ్ల క్రితం తిప్పన్న మృతి చెం దాడు. యశోదమ్మ, చంద్రశేఖర్ గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం తల్లీకొడుకులు గొడవపడ్డారు. పురుగుల మందు తాగిచస్తానని చంద్రశేఖర్ తల్లిని బెదిరించాడు. నువ్వు తాగి చావడం ఎందుకు నేనే తాగుతానంటూ తల్లి వాగ్వాదానికి దిగింది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. స్థానికులు వెంటనే వారిని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
మరో ఘటనలో..
సంగెంకాలన్ గ్రామానికి చెందిన మరియప్ప పాలేరుగా పని చేస్తున్నాడు. నెల రోజులుగా పనికి వెళ్లలేదు. శుక్రవారం ఉన్నట్టుండి గడ్డిమందు తాగాడు. స్థానికులు గమనించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మరియప్ప కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement