తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె శాంతికుమారిని సోమవారం ఉదయం మెరుగైన చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.
తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె శాంతికుమారిని సోమవారం ఉదయం మెరుగైన చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఆమెను ఆదివారం ఉదయం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. అయితే నిపుణుల సూచన మేరకు మెరుగైన చికిత్సకోసం సోమవారం ఉదయం చెన్నైకి తరలించారు.