రాయదుర్గంలోని మారెమ్మగుడి వీధికి చెందిన ఎరికల గంగన్న(35)పై శుక్రవారం హత్యాయత్నం జరిగిందని ఎస్‌ఐ మహానంది తెలిపారు.
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గంలోని మారెమ్మగుడి వీధికి చెందిన ఎరికల గంగన్న(35)పై శుక్రవారం హత్యాయత్నం జరిగిందని ఎస్‌ఐ మహానంది తెలిపారు. అనంతపురానికి చెందిన ఎరికల సుంకన్న తన అనుచరులతో కలసి శుక్రవారం సాయంత్రం స్కార్పియోలో వచ్చి ఇంటి వద్ద ఉన్న గంగన్నపై కత్తితో దాడి చేశారని వివరించారు.
సమాచారం అందిన వెంటనే తాము అక్కడికి చేరుకోగా నిందితులు తమ స్కార్పియోను వదిలి పారిపోయారని చెప్పారు. గాయపడిన గంగన్నను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్ణాటకలోని బళ్లారి విమ్స్‌కు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా నిందితుల్లో ఒకరిని పోలీసులు వెంబడించి పట్టుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.