తాగిన మైకంలో ఓ యువకుడు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నందికొట్కూరులో చోటు చేసుకుంది.
మహిళపై హత్యాయత్నం
Nov 28 2016 11:20 PM | Updated on Aug 1 2018 2:29 PM
నందికొట్కూరు: తాగిన మైకంలో ఓ యువకుడు మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నందికొట్కూరులో చోటు చేసుకుంది. పట్టణంలోని ఏబీఎం పాలెంలో నివసిస్తున్న బొగ్గుల నాగలక్ష్మమ్మ (48) సోమవారం ఇంటి వద్ద ఉండగా.. మారుతి నగర్‌కు చెందిన శంకర్ కొడవలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏడాది క్రితం శంకర్‌ను భార్య వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతను మద్యానికి బానిసై అనవసరంగా అందరితో ఘర్షణ పడుతున్నాడు. నాగలక్ష్మమ్మ కుమారుడు, శంకర్ ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో శంకర్ ఆమెపై దాడి చేశాడు. కాగా దాడికి కారణాలు తెలియరాలేదు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
Advertisement
Advertisement