ఎస్‌బీ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న నాగరాజు
జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) డీఎస్పీగా ఉప్పుటూరి నాగరాజు ఆదివారం విధుల్లో చేరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ఒంగోలు క్రైం :
జిల్లా స్పెషల్ బ్రాంచి (ఎస్‌బీ) డీఎస్పీగా ఉప్పుటూరి నాగరాజు ఆదివారం విధుల్లో చేరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాయపాటితో పాటు నాగరాజులు ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రంవర్మను ఆయన చాంబర్‌లో కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీతో కొంతసేపు ముచ్చటించారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం వెంకటేశ్వరపాలేనికి చెందిన నాగరాజు 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందినవారు. మొట్టమొదటగా ఎస్సైగా జిల్లాలోని నాగులుప్పలపాడులో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మద్దిపాడు, కారంచేడు, చీరాల ఒన్‌టౌన్, ఒంగోలు ఒన్‌టౌన్, గిద్దలూరు టౌన్, నెల్లూరు జిల్లా నాయుడుపేట, సూళ్లూరుపేట ఎస్సైగా చేసి ఆ తర్వాత సీఐడీకి వెళ్లారు. 2010లో సీఐగా పదోన్నతి పొందారు. మొదటగా ఒంగోలు ఒన్‌టౌన్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా రేపల్లె, ఒంగోలు ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వర్తించారు. 2014 జూలై 10న డీఎస్పీగా పదోన్నతి పొందారు. మొదటగా అనంతపురం, ఒంగోలు పీటీసీల్లో డీఎస్పీగా పనిచేశారు. ఒంగోలు పీటీసీ నుంచి బదిలీపై ఎస్‌బీ డీఎస్పీగా విధుల్లో చేరారు.