శైలపుత్రీ నమోస్తుతే.. | namostute shailapustry | Sakshi
Sakshi News home page

శైలపుత్రీ నమోస్తుతే..

Published Sun, Oct 2 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

namostute shailapustry

అలంపూర్‌ రూరల్‌ : దేవీశరనవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఐదోశక్తి పీఠమైన జోగుళాంబ అమ్మవారిని ఆలయంలో శనివారం తొలిరోజు శైలపుత్రిగా అలంకరించారు.  ప్రదోశకాలంలో ధ్వజారోహణ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సంపత్‌కుమార్, ఆలయ ఈఓ నరహరిగురురాజ ధ్వజ స్తంభానికి సింహవాహనంతో కూడిన జెండాను ఎగురవేశారు. ఉత్సవాల విజయానికి సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని అర్చకులు విక్రాంత్‌శర్మ తెలిపారు. 
 
నవదుర్గలలో తొలి రూపమైన శైలపుత్రి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందన్నారు. శైలపుత్రికి ప్రీతిప్రదంగా సువాసిని, కుమారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జయరాముడు, ఎంపీపీ శంషాద్‌ ఇస్మాయిల్, సింగిల్‌విండో సభ్యుడు బ్రహ్మేశ్వరరెడ్డి, స్థానిక నాయకులు ఇంతియాజ్, నాగభూషణం, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement