'అది దీక్ష కాదు.. బాబు భజన' | Nava nirmana deekshas looks like TDP meetings: YSRCP MLA RK Roja critisises | Sakshi
Sakshi News home page

'అది దీక్ష కాదు.. బాబు భజన'

Published Mon, Jun 6 2016 2:33 PM | Last Updated on Sat, Oct 20 2018 4:47 PM

'అది దీక్ష కాదు.. బాబు భజన' - Sakshi

'అది దీక్ష కాదు.. బాబు భజన'

తిరుపతి: నవనిర్మాణ దీక్ష పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడం దారుణమని, అవి చంద్రబాబు భజన కార్యక్రమాలుగా మారిపోయాయని నగరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా విమర్శించారు. 'నా నియోజకవర్గంలో జరుగుతోన్న నవనిర్మాణ దీక్షకు ఎమ్మెల్యేనైన నాకే ఆహ్వానం పంపలేదు' అని ఆమె వాపోయారు. సోమవారం తిరుపతి వచ్చిన రోజా విలేకరులతో మాట్లాడారు.

గతంలో చంద్రబాబు ఒక్క హైదరాబాద్ పైనే దృష్టి కేంద్రీకరించిన విధంగా ఇప్పుడు అమరావతి పేరును జపిస్తున్నారని, అలా చెయ్యడం సరికాదని, అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమని రోజా అన్నారు. గడిచిన రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన, రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం అన్నిపార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా టీడీపీ ప్రయత్నించాలని కోరారు. కాగా, ఆహ్వానం లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే హోదాలో తిరుపతిలోని విజయపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో రోజా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement