పంద్రాగస్టు పరేడ్‌కు ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక | NCC cadet selected for 15th august pared | Sakshi
Sakshi News home page

పంద్రాగస్టు పరేడ్‌కు ఎన్‌సీసీ క్యాడెట్ల ఎంపిక

Published Tue, Aug 9 2016 12:40 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

NCC cadet selected for 15th august pared

పోచమ్మమైదాన్‌ : హైదారాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల్లో పరేడ్‌కు వరంగల్‌లోని లాల్‌ బహుదుర్‌ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు సందీప్, రాజేష్, సురేష్‌ ఎంపికయ్యారు. వీరిని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సత్య పరమేశ్వర్‌ సోమవారం అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ కళాశాల నుంచి పరేడ్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఎన్‌సీసీ వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి డాక్టర్‌ మొండ్రాతి సదానందం, అండర్‌ ఆఫీసర్‌ వినయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement