‘నీలగిరి’లో భారీ వర్షం
Published Thu, Jul 28 2016 1:46 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
నల్లగొండ టూటౌన్ : పట్టణంలో బుధవారం సాయంత్రం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతినగర్, ఆర్పీరోడ్డు, బొట్టుగూడ, సాయినగర్ కాలనీ, చైతన్యపురి, లైన్‌వాడ, లెప్రసీకాలనీ, పద్మావతీకాలనీ, ఆర్టీసీకాలనీ, అంధుల పాఠశాల ఏరియా, శ్రీరాంనగర్ తదితర కాలనీల్లో రోడ్ల వెంట వరదనీరు భారీగా పారింది. పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న డ్రెయినేజీలు పొంగిపొర్లడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
Advertisement
Advertisement