పురోహితులపై ఆంక్షలు లేవు
Published Sun, Aug 14 2016 1:26 AM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ
విజయవాడ(వన్‌టౌన్) :
పుష్కరాల్లో భాగంగా పిండ ప్రదానాలు, పుష్కర సంకల్పం నిర్వహించే పురోహితులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ అన్నారు. పుష్కరాల్లో భాగంగా దేవాదాయ ధర్మదాయ కమిషనర్ అనూరాధ నగరంలోని పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి, భవానీ ఘాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం దుర్గాఘాట్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పురోహితులు అన్ని పుష్కర ఘాట్లలో అందుబాటులో ఉండాలన్నారు. యాత్రికుల సంక్పలం, పిండ ప్రదానం తదితర క్రతువుల నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా పురోహితులు ఏ ఘాట్లలోనైనా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అయితే రద్దీగా ఉన్న ఘాట్లలలోనే పురోహితులు అందరూ ఉంటే మిగిలిన ఘాట్లలోని పుష్కర యాత్రికులకు పురోహితులు దొరకక పలు ఇబ్బందులకు గురవుతారన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొదటి రోజున 38 వేల పిండ ప్రదానాలను పుష్కర యాత్రికులు నిర్వహించారన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 27 వేలు, గుంటూరు జిల్లాలో 9600, కృష్ణాజిల్లాలో 1400 పిండ ప్రదానాలు చేశారని వివరించారు.
Advertisement
Advertisement