ఉద్యోగాలు భర్తీ చేయాలని దీక్ష
ఆదిలాబాద్ అర్బన్ : ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీ, మసిఉల్లా ఖాన్, నాయకులు రాజు, విశాల్, సమీద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర సాదనలో ముందుండి పోరాటాలు చేసిన విద్యార్థులకు పలు హామీలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లవుతున్న ఇంకా విద్యార్థులు, యువకులు, ప్రజలు ఆశలపల్లకిలో ఊరేగిస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ఇయర్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. బడ్జెట్‌లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.