![ప్రధాని పర్యటనలో ఉస్మానియా వైద్య బృందం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81469311420_625x300_1.jpg.webp?itok=41jgBH3P)
ప్రధాని పర్యటనలో ఉస్మానియా వైద్య బృందం
అఫ్జల్‌గంజ్: తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 7న పర్యటించనున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాన్వాయిలో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం పాల్గొంటుందని ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ, ప్రధాని పర్యటన వైద్యబందం టీమ్ లీడర్ డాక్టర్ మహ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని హైదరాబాద్ పర్యటనతో పాటు, మెదక్ జిల్లా మిషన్ భగీరధ ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని అక్కడికి కూడా ఉస్మానియా వైద్యులు వెళుతుందని తెలిపారు. ఈ పర్యటనలో తనతో పాటు ఇతర వైద్యులు, సహాయక సిబ్బంది ఉంటారని తెలిపారు.