తిరుగు ప్రయాణంలో తిరిగిరాని లోకాలకు..
Published Mon, Feb 27 2017 12:43 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
– రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
కల్లూరు : చిన్నటేకూరు కొట్టం కాలేజీ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు..తంచర్ల మండలం మండ్లవానిపల్లెకు చెందిన బోయ ఎల్లస్వామి, బోయ ఎల్లరాముడు, పోతులూరయ్య, ఎల్లనాయుడు, రంగనాయకులు, మద్దిలేటి స్వామి, మద్దయ్య ట్రాలీ ఆటో తీసుకుని బియ్యం కొనుగోలు చేసేందుకు పెద్దటేకూరులోని బాలాజీ రైస్ మిల్‌కు వచ్చారు. మధ్యాహ్నం బియ్యాన్ని కొనుగోలు చేసుకుని ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. కొట్టం కాలేజీ వద్దకు రాగానే వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఆటో బోల్తా పడి అందులో ఉన్న ఏడుగురికీ తీవ్రగాయాలయ్యాయి. 108లో వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ బోయ ఎల్లస్వామి (39) కోలుకోలేక మృతిచెందాడు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతునికి భార్య రంగనాదమ్మ ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement