సంబరాలు చేసుకున్న ప్రజలు
సంబరాలు చేసుకున్న ప్రజలు
Published Tue, Aug 23 2016 6:20 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
యాదగిరిగుట్ట: తెలంగాణలో సాగు భూములకు నీరందించేందుకు కేసీఆర్ సర్కార్ మహారాష్ట్ర ప్రభుత్వంతో జల ఒప్పందం చేసుకోవడం బంగారు తెలంగాణ కు బాటలు వేసుకోవడమేనని టీఆర్‌ఎస్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు తెలిపారు. మంగళవారం మహారాష్ట్రతో తెలంగాణ సర్కార్ జల ఒప్పందం చేసుకోవడంతో యాదగిరిగుట్టలో ఆ పార్టీ ఆధ్వర్యంలో వారు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వైకుంఠద్వారం చెంత 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరిపై మేడిగడ్డ బ్యారేజితో కాళేశ్వరం ప్రాజెక్టు కింద కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో 18లక్షల ఎకరాలు, ప్రాణహితపై తుమ్మడిహట్టి బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాలు, పెనుగంగాపై చనాక–కొరాట బ్యారేజీతో ఆదిలాబాద్‌లోని తాంసీ, జైనథ్, బేలా మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. అంతకు ముందు గుట్ట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, ఎంపీటీసీ సీస కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుండె నర్సయ్య, బైరగాని పుల్లయ్య, పల్లెపాటి కృష్ణ, కౌడె మహేందర్, గ్యాదపాక బాల్‌నర్సయ్య, మిట్ట వెంకటయ్య, కాంటేకార్ పవన్‌కుమార్, ఆవుల సాయియాదవ్, మిట్ట అనిల్‌గౌడ్ తదితరులున్నారు.
Advertisement