మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ ఎంపికలో భాగంగా సోమవారం మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. ఉష్ణోగ్రతలు పడిపోయి విపరీతమైన చలి ఉన్నా లెక్క చేయకుండా ఉదయం 5 గంటల నుంచే బెటాలియన్ చేరుకొని ఉత్సాహంగా కనిపించారు. వీరికి అధికారులు నిబంధనలు మేరకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. ముందుగా ఎత్తు, చెస్టు కొలతలను తీసుకొని వంద మీటర్లు, 16 వందల మీటర్లు, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలను నిర్వహించారు. మొత్తం 1067 మందికిగాను 450 మంది ప్రధాన పరీక్షలకు ఎంపికయ్యారు. సర్టిఫికెట్లు లేకపోవడంతో 150 మందిని వెనక్కి పంపారు.