విద్యార్థినులను మింగిన మడుగు
-
నీటిగుంతలో పడి ఇద్దరు బాలికలు మృత్యువాత
-
ప్రాణాలతో బయటపడ్డ మరో ఇద్దరు చిన్నారులు
-
కారకులపై చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
రెబ్బెన : అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారి విద్యార్థినులను నీటిగుంత బలిగొంది. తోటి విద్యార్థులతో కలిసి సరదాగా బట్టలు ఉతుకుతూ ఆడుకునేందుకు వెళ్లిన విద్యార్థులను నీటి గుంత మత్యువు రూపంలో కబలించింది. మంగళవారం రెబ్బెన మండలంలోని నేర్పల్లిలో ఈ విషాధ ఘటన చోటు చేసుకుంది. నేర్పల్లికి చెందిన టాక్రే లక్ష్మి (7), గుర్లె శిరీష (8) అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకరు రెండో తరగతి, ఒకరు మూడో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా మంగళవారం సెలవుపై వెళ్లడంతో మరో ఉపాధ్యాయుడు ఎమ్మార్సీ కార్యాలయంలో సమావేశం ఉన్న కారణంగా మద్యాహ్నమేd భోజనాల అనంతరం వెళ్లిపోయాడు. దీంతో మద్యాహ్నం పాఠశాల లేకపోవటంతో లక్ష్మి, శిరీషలు స్నేహితులైన జోష్న, రంజితలతో కలిసి గ్రామానికి అనుకుని ఉన్న వాగులో సరదాగా బట్టలు ఉతుకున్నేందుకు వెళ్లారు.
బట్టలు ఉతుకుతూ సరదాగా ఆడుకుంటూ వాగులో ఉన్న మంచినీటి బావి చుట్టూ ఏర్పడిన నీటి గుంతలోకి దిగారు. గుంతలో నీటి లోతు అధికంగా ఉండటంతో నీటిలో లక్ష్మీ, శిరీష గల్లంతయ్యారు. అదే సమయంలో వాగుకు వచ్చిన తోటి విద్యార్థులు మహాలక్ష్మి, పోచుబాయి, శ్యామల, మౌనికలు నీటి గుంతలో పడ్డ స్నేహితులను రక్షించుకునేందుకు పక్కనే ఉన్న కంచె నుంచి వెదురు బొంగును తీసి గుంతలో పడి ఉన్న జోష్న, రంజితలకు అందించారు. దీంతో రంజిత, జోష్నలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అపై లక్ష్మి, శిరీషలను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే వారు నీట మునగడంతో వెంటనే గ్రామానికి వెళ్లి సమాచారం అందించారు. గ్రామస్తులు నీటి గుంత లోకి దిగి లక్ష్మి, శిరీషలను బయటకు తీయగా అప్పటికే చిన్నారులు మత్యు ఒడికి చేరుకున్నారు.
ఒకేసారి ఇద్దరు చిన్నారులు మత్యువాత పడడంతో గ్రామంలో పూర్తిగా విషాధచాయలు అలుముకున్నాయి. మతుల కుటుంబాల రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న రెబ్బెన తహసీల్దార్ రమేష్‌గౌడ్, ఎసై ్స సురేష్, ఎంఈవో వెంకటేశ్వర స్వామి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సమాచారం తెలుసుకున్న జెడ్పీటీసీ బాబురావు, నాయకులు శ్రీధర్‌రెడ్డి, సుదర్శన్‌గౌడ్, శ్రీధర్, కార్నాథం పెంటయ్యలతో పాటు ప్రముఖులు ఘటన స్థలికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు తగు న్యాయం చేయాలి
విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలాకు తగు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం సంభవించిందని వెంటనే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబాలతో కలిసి గ్రామంలోని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
ఈసందర్భంగా పలువురు విద్యార్థిసంఘాల నాయకులు మాట్లాడుతూ పాuý శాల పని వేళల సమయాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇద్దరు విద్యార్థులు మతి చెందిన డీఈవో స్పందించకపోవటం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే బాదిత కుటుంబాలకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా, 5ఎకరాల ప్రభుత్వ భూమి అందించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుర్గ రవీందర్, టీవీవీ జిల్లా అధ్యక్షుడు కడతల సాయి, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, బాధిత కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.