హరితహారం ఏర్పాట్ల పరిశీలన
Published Sun, Jul 17 2016 11:15 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
మెట్‌పల్లి: పట్టణంలో సోమవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హరితహారం కోసం ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. 14వార్డులో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మొక్కలు నాటి ప్రారంభించనున్నారు. ఏర్పాట్లను ఆదివారం కమిషనర్ నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24వార్డుల్లో 55వేల మొక్కలు నాటడం లక్ష్యమన్నారు. మొదటి రోజు 15వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ బర్ల భాగీరథ, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు బర్ల సాయన్న, నాయకుడు మర్రి సహాదేవ్ ఉన్నారు.
Advertisement
Advertisement