పోలీసుల శ్రమదానం | police staff on social work | Sakshi
Sakshi News home page

పోలీసుల శ్రమదానం

Sep 26 2016 4:57 PM | Updated on Aug 21 2018 9:20 PM

అల్లాదుర్గంలో గుంతలు పూడుస్తున్న ఎస్‌ఐ, సిబ్బంది - Sakshi

అల్లాదుర్గంలో గుంతలు పూడుస్తున్న ఎస్‌ఐ, సిబ్బంది

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

అల్లాదుర్గం: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్లు గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అల్లాదుర్గం చౌరస్తాలో రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. అల్లాదుర్గం ఎస్‌ఐ మహ్మద్‌ గౌస్‌ స్పందించారు. సోమవారం తన సిబ్బందితో కలిసి శ్రమదానం చేపట్టి గుంతలను పూడ్చారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ వెంకటేశం, కానిస్టేబుళ్లు నర్సింలు, మస్తాన్, గంగాధర్, రాంపూర్‌ రాజు, మోహన్‌రాథోడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement