
వైద్య విద్యార్థినులపై వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
ఒంగోలు: వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్న ఓ ప్రొఫెసర్ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే... ఒంగోలు రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బంకా రత్నం (35)ను గత కొంతకాలంగా కాలేజీలోని వైద్య విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో బాధిత విద్యార్థినులు బుధవారం జిల్లా ఎస్పీ త్రివిక్రమ్ వర్మను కలిసి ప్రొఫెసర్ వేధింపులపై ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి బంకా రత్నంను అరెస్ట్ చేశారు. వేధింపులపై పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.