ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలి
ఫ్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయాలి
Published Sat, Oct 29 2016 8:03 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
పట్నంబజారు: జూనియర్ డాక్టర్ సంధ్యారాణి మృతికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని తక్షణం అరెస్టు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ హిందూ కళాశాల, ఏసీ కళాశాల అధ్యక్షులు యాదాల రామ్, దానం వినోద్ ఆధ్వర్యంలో నాయకులు శనివారం జీజీహెచ్‌లో జూడాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. సంధ్యారాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. సంధ్యారాణి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ విద్యార్థి విభాగం నగర కార్యదర్శి కె.క్రాంతి, నాయకులు కాశి, సి.హెచ్.తిలక్, సురేంద్ర, జె.వంశీ, డి.తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలి..
గుంటూరు మెడికల్ : గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిని విధుల నుంచి తొలగించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంప్లాయీస్ యూనియన్(వైఎస్సార్ టీయూసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.మాలకొండయ్య పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూనియర్ డాక్టర్స్ సమ్మెకు తమ మద్దతు తెలియజేస్తున్నామని, సంధ్యారాణి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు మాలకొండయ్య తెలిపారు.
Advertisement
Advertisement