రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో జనగాంను కూడా చేర్చాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో జనగాంను కూడా చేర్చాలనే డిమాండ్లు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని సెల్‌టవర్‌పైకి గురువారం ఉదయం ఐదుగురు యువకులు ఎక్కి నిరసన తెలిపారు. తమ వెంట పెట్రోల్ బాటిళ్లను కూడా తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే జనగాం జిల్లాను ప్రకటించకుంటే ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని కిందికి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. టవరెక్కిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, యువజన కాంగ్రెస్ నేత గోవర్థన్ ఉన్నారు.