వరంగల్ జిల్లా కాజీపేటలోని ప్రఖ్యాత హజరత్ సయ్యద్ షా దర్గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రెహమాన్ తదితరులతో కలసి దర్గాకు వచ్చారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేశారు.
వైఎస్ జగన్‌కు కు కుసుర్ పాషా, ఇతర మత పెద్దలు స్వాగతం పలికారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముస్లింల కోసం రిజర్వేషన్లు సహా ఎంతో చేశారని వైఎస్ జగన్ చెప్పారు. వాటిని దృష్టిలో ఉంచుకుని ముస్లింలు అందరూ తమ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థికి మద్దతు పలకాలని కోరారు. అనంతరం నేతలతో కలసి వైఎస్ జగన్ హన్మకొండకు వెళ్లారు.