వరంగల్లో వైఎస్ జగన్ ప్రచారం | ys jagan campaign at warangal district | Sakshi
Sakshi News home page

వరంగల్లో వైఎస్ జగన్ ప్రచారం

Published Mon, Nov 16 2015 6:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

వరంగల్లో వైఎస్ జగన్ ప్రచారం - Sakshi

వరంగల్లో వైఎస్ జగన్ ప్రచారం

వర్దన్నపేట: వరంగల్ జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. గ్రామాల్లో అడుగడుగునా ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతన్నారు. సోమవారం సాయంత్రం జఫర్‌గఢ్ నుంచి వర్దన్నపేట మండలంలోకి ప్రవేశించారు.

మండలంలోని దమ్మన్నపేట వద్ద వాహనం దిగి..పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలతో మాట్లాడారు. పొలుగు హైమావతి అనే వ్యవసాయ కూలీతో కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెడ్డిపాలెం వైపు వెళ్లారు.రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాదాపు అరగంటపాటు ఆయన అక్కడే ఉండి వారితో మాట్లాడారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సూర్యప్రకాశ్, ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement