దుర్గమ్మ పుష్కర ఆదాయం లెక్కింపు ప్రారంభం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : కృష్ణా పుష్కరాల సమయంలో కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు ప్రక్రియను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో ప్రారంభించారు. మొత్తం కానుకలు, మొక్కుబడులను కలిపి 25కు పైగా మూటలు కట్టారు. తొలి రోజు 85 మూటలు లెక్కించగా, రూ.1,30,34,329 నగదు, 145 గ్రామలు బంగారం, 2.301 కిలోల వెండి లభించినట్లు ఆలయ ఈవో సూర్యకుమారి తెలిపారు. మంగళ, బుధవారాలు కూడా కానుకలను లెక్కిస్తారు. కానుకల లెక్కింపు ప్రక్రియలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.