జిల్లా రైతాంగంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
– నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం దుర్మార్గం
– రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం
అనంతపురం అర్బన్ : జిల్లా రైతాంగంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2015కు సంబంధించి ప్రకటించిన నష్ట పరిహారం జాబితాలో జిల్లా లేకపోవడం దుర్మార్గమంటూ దుమ్మెత్తిపోశారు. త„ýక్షణం పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గణేనాయక్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు తరిమెల నాగరాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
తీవ్ర వర్షాభావం కారణంగా వేరుశనగ పంట ఎండిపోవడంతో 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు పరిహారం మంజూరులో మొండిచేయి చూపడం దారుణమన్నారు. రైతాంగంపై జిల్లా మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 2015–16, 2016–17కు సంబంధించి నష్టపరిహారం ప్రకటించేలా చూడాలన్నారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.