రైతుల స్థితి గతులపై ఈ నెల 5న కదిరిలో రైతు సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం అర్బన్ : రైతుల స్థితి గతులపై ఈ నెల 5న కదిరిలో రైతు సంఘం (సీపీఎం) ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు షాలిమార్ ఫంక్షన్ హాల్‌లో జరిగే సదస్సుకు శాసన మండలి మాజీ సభ్యులు ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు హాజరవుతారన్నారు. సదస్సుకు రైతులు, రచయితలు, మేథావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.