పర్వతారోహణలో ‘రాణి’ంపు
పర్వతారోహణలో ‘రాణి’ంపు
Published Sun, Dec 11 2016 2:19 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
పోలసానిపల్లి (భీమడోలు): పోలసానిపల్లి సాంఘిక సంక్షే మ గురుకుల బాలికల కళాశాల సీని యర్ ఎంపీసీ విద్యార్థిని బొడ్డు రాణి ఎవరెస్ట్ పర్వత శ్రేణిలోని 17 వేల అడుగుల ఎత్తయిన మౌంట్ రేనార్క్‌ను అధిరోహించి సత్తాచాటింది. శనివారం కళాశాలకు వచ్చిన రాణికి తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో 28 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధం చేశారు. వీరిలో 15 మంది సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు, 13 మంది గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉన్నారు. వీరంతా గతంలో రాష్ట్రస్థాయి గురుకుల పోటీ ల్లో విజేతలుగా నిలిచివారే కావడం విశేషం. జిల్లా నుంచి పోలసానిపల్లి గురుకుల పాఠశాల నుంచి లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెం దిన బొడ్డు రాణి ఎంపికైంది. వీరందరికీ ఎవరెస్ట్ అధిరోహించిన శేఖర్‌బాబు పర్యవేక్షణలో అక్టోబర్ నెలలో విజయవాడ సమీపంలోని కేతనకొండ ను అధిరోహించేందుకు ఆరు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ బృందం నవంబర్ 12న డార్జింగ్‌కు బయలుదేరింది. వీరి ని అక్కడ ఉన్న డాస్కింగ్ మార్కే అనే ట్రైనింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. 28 మందిని రెండు గ్రూపులకు ఆరేసి మం ది చొప్పున, మిగిలిన రెండు గ్రూపుల్లో 8 మందిగా విభజించారు. వీరంతా రేనార్క్ పర్వతాన్ని అధిరోహించగా బొడ్డు రాణి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. మిగతా జట్ల కన్నా గంట ముందుగా గమ్యాన్ని చేరుకుంది. జి ల్లాలోని పెదవేగి గురుకులానికి చెందిన çసద్దిపాముల వేణు, వట్లూరు గురుకులానికి చెందిన బొబ్బిలి దీప్తి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరంతా వచ్చే మే నెలలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఎంవీవీ సూర్యారావు తెలిపారు. అనంతరం బొడ్డు రాణి, అధ్యాపకులు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కలిశారు.
Advertisement